నడిగడ్డను ఎడారిగా మార్చే కుట్రకు నీరసన ర్యాలీ

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 28 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : రైతులతో నిరసన ర్యాలీగా తాగునీరు సాగునీరు కోసం కలెక్టర్ కార్యాలయం ముట్టడి గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన రేపు అనగా 29-07-2026నాడు బుధవారం రోజు ఉదయం 10:00గంటలకు ధరూర్ పెట్టు నుండి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం ముట్టడి జూరాల కుడి ఎడమ కాలువల నీటి విడుదలపై అడ్డంకులు.తాగునీటి అవసరాల కోసం జమ్ములమ్మ రిజర్వాయర్ల కు నీటిని విడుదల చేయట్లేదు.నడిగడ్డకు వరద నీటిని ఇచ్చేదానికన్నా ఆంధ్రకు నీరు వదిలేందుకు అధికారులు ఎక్కువ మగ్గు చూపుతున్నారు. నడిగడ్డ రైతన్నకు ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు వరద నీటి విడుదలకు అడ్డంకులు.ప్రస్తుత ప్రభుత్వానికి నడిగడ్డపై సవతి ప్రేమనే ఎక్కువ కనబడుతోంది.విద్యుత్ ఉత్పత్తి పేరిట ఆంధ్రకు ఎక్కువ నీటి విడుదల. గద్వాల నియోజకవర్గంలోని ప్రధాన వ్యవసాయ నీటి వనరులు నెట్టెంపాడు ప్రాజెక్టు గొలుసుకట్టు చెరువులు ద్వారా సాగు చేస్తుంటారు. చెరువులకు నీరు వదలడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు నీటిమట్టం పెరుగుతుంది. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా గద్వాల నియోజకవర్గంలోని దాదాపు 119 చెరువులకు నీరు గొలుసుకట్టు ద్వారా అందుతాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావులలో నీరు పూర్తిస్థాయిలో వస్తుంది.నీటి వనరులను పెంచడంలో గొలుసు కట్టు చెరువులు పాత్ర కీలకం. ధరూర్ మండలంలోని మన్నాపురం అమ్మకుంట నుంచి సోంపురం శేషంపల్లి కుంట నుంచి పార్చర్ల చెరువు నుంచి పెద్దపాడు చెరువు వరకు అలాగే చింతరేవుల చెరువు నుంచి రేవులపల్లి భీంపురం వరకు ర్యాలంపాడు చెరువు నుంచి బూరెడ్డిపల్లి చెరువు ఓబులోనిపల్లి చెరువు నుంచి ధరూర్ పెద్ద చెరువు నుంచి సంఘాల చెరువు నుంచి గోన్పాడు చెరువు మర్లపల్లి చెరువు నుంచి జిల్లెడు బండ చెరువు నుంచి మెల్ల చెరువు అలాగే సద్దలోని పల్లి చెరువు నుంచి కొండపల్లి చెరువుకు ఎర్రవల్లి అడవి రావులచెరువు వరకు నీళ్లు వస్తుంది.అలాగే కేటీ దొడ్డి మండలంలొ కొండాపురం చెరువు నుంచి వెంకటాపురం చెరువు అక్కడ నుంచి ఇర్కిచేడు ఎర్ర చెరువు వరకు నందిన్నె చెరువు నుంచి కూచినేర్ల చెరువు చింతలకుంట యర్సన్ దొడ్డి చెరువు వరకు నీరు వెళ్తాయి.మాల్డకల్ మండలంలో నాగర్ దొడ్డి రిజర్వాయర్, తాటికుంట రిజర్వాయర్ కోమటికుంట మాల్డాకల్ ద్యావరచెరువు మాల్డాకల్ ఎల్కూర్ చెరువు లింగమ్మ చెరువు అమరావయి బిజ్వారం చెరువులుగట్టు మండలంలొ ముచొనిపల్లి రిజర్వాయర్, చిన్నోనిపల్లి రిజర్వాయర్, కింద చింతలచెరువు చాగదోన పళ్లెవనికుంట చాగదోన ఎర్రగుంట చాగదోన బల్గర చెరువు గౌణికుంట మల్లంపల్లి ఇందువాసి ఇంజమ్మచెరువు అరగిద్ద గొర్లఖాన్ దొడ్డిలొ మూడు చెరువులు లింగోని కుంట గట్టు పెద్ద చెరువు సాల్కాపురం జానయ్య కుంట మిట్టదొడ్డి బాపనయ్య కుంట వరకునడిగడ్డను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుంది అంటే అవుననే చెప్పాలి. తెలంగాణలో మొట్టమొదట కృష్ణమ్మ ఎంట్రీ ఇచ్చేది జూరాల ప్రాజెక్టుకు. ప్రస్తుతం ప్రభుత్వం వరద నీటిని వడసిపట్టడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమవుతుంది. జూరాలకు కృష్ణమ్మ 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న, రిజర్వాయర్లను నింపడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికే జూరాల కూడి ఎడమ కాలువలలో సైతం నీటిని విడుదల చేయడానికి మల్లగుల్లలు పడుతున్నారు. ఎగువనున్న కర్ణాటక రాష్ట్రం మాత్రం రైతుల కోసం అక్కడి ప్రాజెక్టులను నిండుగా నింపుకొని రైతులకు నీటిని వదులుతున్నాయి. తెలంగాణలో మాత్రం వరద నీటిని ఏ విధంగా వాడుకోవాలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది.అధికారుల నిర్లక్ష్యం అవగాహనరహిత్యంతో వరద నీటిని కిందకు వదులుతున్నారు. వడ్డించేవాడు మనవాడు అయితే ఏ మూలన కూర్చున్న మనకు వస్తుందనే సామెతకు మన పాలకుల తీరు విరుద్ధంగా ఉంది. మన పాలకులకు తెలంగాణపై ఉన్న ప్రేమ కన్నా ఆంధ్ర పై ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనబడుతోంది.పాలకులు అధికారులు మాత్రం నీటి వినియోగంపై తలోమాట మాట్లాడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో తాగునీటికీ మొదటి ప్రాధన్యత అని చెప్పిన, తాగునీటికి సైతం నీరు వదిలేందుకు మల్లగుల్లలు పడుతున్నారు. గద్వాల పట్టణానికి తాగునీరు కావాలంటే జమ్మలమ్మ రిజర్వాయర్ నుంచి నీరు అందుతుంది. అయితే ఈ నీటిని జూరాల సోమనాద్రి ఎడమ కాలువ నుంచి రావాలి. ఎడమ కాలువకు సైతం నీటిని విడుదల చేయడం లేదు. గతంలో జూరాలకు వరద వచ్చిందంటే ముందుగా నెట్టెంపాడు ద్వారా నీటిని ర్యాలంపాడు, గుడ్డెం దొడ్డి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసేవారు. వీటితో గొలుసు కట్టు చెరువులను నీటితో నింపేవారు. ప్రస్తుతం వరద 30 వేల క్యూసెక్కులు వస్తున్న 430 క్యూసెక్కులు నెట్టంపాడు కాలువ ద్వారా నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు.విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని ఆంధ్రకు ఎక్కువ వదులుతున్నారు. అవగాహన లోపంతో జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిలో 4 యూనిట్లు రన్ చేస్తున్న 8 వేల 5 వందల క్యూసెక్కుల నీరు అవసరం ఉన్న, అధికారులు మాత్రం 9670 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి తెలంగాణ రైతుల మీద ప్రేమ కన్నా, ఆంధ్ర పాలకుల మేప్పు కోసం ఎక్కువ నీటిని వదులుతున్నట్లు కనబడుతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జూరాల కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలి నెట్టెంపాడు నుంచి ర్యాలంపాడు గుడ్డెందొడ్డి రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా గొలుసు కట్టు చెరువులకు నీరు వదలాలి లేదంటే రైతు అగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది రైతుల అవశ్యక్తను తెలపడం కోసం భారీగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని స్థాయిలు చైర్మన్లు కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ మాజీ ఎంపీపీ మాజీ జెడ్పిటిసిలు మ సర్పంచులు మాజీ సర్పంచులు జిల్లా సీనియర్ నాయకులు సింగిల్ విండో వ్యవసాయ మార్కెట్ ఆలయ కమిటీ డైరెక్టర్స్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి..

🌐 Select Language:
📰 ePaper