నలంద పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు.. విద్యార్థుల భక్తిశ్రద్ధ ఆకట్టుకుంది

July 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 28: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలోని నలంద పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగను మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు అమ్మవారి ప్రతిమను అందంగా తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయినులు బోనాలు ఎత్తుకొని సంప్రదాయ బద్ధంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంకట్ గౌడ్, ప్రిన్సిపాల్ గణేష్, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper