తెలంగాణ

దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు న్యాయ సేవలపై అవగాహన

దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు న్యాయ సేవలపై అవగాహన

జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా లో దివ్యాంగ విద్యార్థులు తమ హక్కులు అవకాశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నిష్క పాత్రుడు దివ్యాంగ విద్యార్థులు విద్యతో పాటు ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,న్యాయమూర్తి నిష్క పాత్రుడు సూచించారు శనివారం గద్వాల పట్టణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని అంధుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు,న్యాయ సేవలు,హక్కులు మరియు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి నిష్క పాత్రుడు హాజరై విద్యార్థులతో మాట్లాడాం దివ్యాంగ విద్యార్థులు విద్యతో పాటు భవిష్యత్తులో స్వయం ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాల ను పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ప్రాధాన్యతను వివరించారు.ముఖ్యంగా దివ్యాంగజన్ కౌశల్ వికాస్ మరియు దివ్యాంగజన్ రోజ్గర్ సేతు కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ,ఉపాధి అవకాశాలు,ఉద్యోగ సంబంధిత సేవలపై అవగాహన కల్పించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన కార్యక్రమాలు మరియు దివ్యాంగుల కోసం అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ పథకాల గురించి న్యాయమూర్తి వివరించారు.ప్రతి దివ్యాంగుడు తన హక్కులను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థలు అందిస్తున్న విద్య,నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, సంక్షేమం మరియు న్యాయ సహాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.న్యాయ సహాయం పొందేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాల్సిన అవసరం లేదని, అర్హులైన వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్య,భవిష్యత్తు లక్ష్యాలు ఆసక్తులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సందేహాలను అవసరాలను తెలియజేయగా వాటిపై తగిన అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు దివ్యాంగ విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్య, ఉపాధి మరియు స్వయం ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలను పొందవచ్చని వివరించారు.సమాజంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పన మరియు వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగన్న ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.జారీ చేయువారు డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా

ఇ-పేపర్