నీటి ఎద్దడిపై కాట్రేనికోనలో సమీక్ష సమావేశం – కాలువల ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా*కాట్రేనికోన :* మండలంలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యపై శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దారు రవి కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రాజేశ్వరరావు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎం మృదుల నీటి పారుదల శాఖ సహాయ ఇంజనీరు, కాలువలు మరియు పారుదల శాఖ సహాయ ఇంజనీరు, మండల వ్యవసాయ అధికారి ఎం మృదుల తో పాటు నీటి సంఘాల అధ్యక్షులు ఆకాశం శ్రీనివాస్, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.సమావేశంలో నీటి పారుదల కాలువల వద్ద జరుగుతున్న ఆక్రమణల అంశంపై విస్తృతంగా చర్చించారు. కాలువల్లోని ఆక్రమణలను గుర్తించాల్సిందిగా మండలంలోని అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, కాలువలు మరియు పారుదల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించే అంశంలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. గ్రామ మరియు మండల స్థాయిలో ప్రత్యేక రిజిస్టర్లను తయారు చేసి ఆక్రమణల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల వ్యవస్థను పటిష్టపరచడం, రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు.-