పెద్ద కోడ పాక గ్రామంలో కురుమ కులస్తులు తొలి ఏకాదశి పండుగ ఘనంగా జరుపుకున్నారు

July 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జులై 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామంలో కురుమ కులస్తులు తొలి ఏకాదశి ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా బోనాలను సమర్పించారు పెద్ద మొత్తంలో కులస్తులు పెద్దలు అందరూ పాల్గొని బీరన్న దేవుడిని పాడిపంటలు అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కురుమ కుల పెద్ద అమ్మ తిరుపతి కురుమకుల వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మ రవి జైబీరన్న ఆలయ కమిటీ చైర్మన్ సవ్వాసి బీరయ్య పాల్గొని దేవతలను స్మరించి బోనాలను సమర్పించారు ఇందులో భాగంగా అందరూ వర్షాలు కురిసి తెలంగాణ వర్ధిల్లాలని బీరన్న దేవుడిని , అక్కమహంకాళి కామరాతిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కురుమ కులస్తులు చంద్రమోహన్ సుమన్ అమ్మ సురేష్ రమేష్ భాస్కర్ శ్రీనివాస్ పాల్గొని భగవంతునికి బోనాలను సమర్పించి వారి కోర్కెలను నెరవేర్చాలని ఆ భగవంతుడికనీ వేడుకోవడుకున్నారు…..

🌐 Select Language:
📰 ePaper