ప్రభుత్వం విద్యుత్ ఆర్టిజన్ల కు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.

July 21, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 21( బీబీ పేట్ మండలం కామారెడ్డి జిల్లా )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత మూడు నెలల క్రితం, విద్యుత్ ఆర్టిజన్ల దీర్ఘకాలిక సమస్యలపై, రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి, పది రోజులపాటు సమ్మె చేసిన విషయం.ఇటు యాజమాన్యానికి, అటు ప్రభుత్వానికి, విధితమే సమ్మె కాలంలో సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీ ఇచ్చి మూడు నెలలు గడిచిపోతున్నప్పటికీ, ఆర్టిజన్ల సమస్యలపై, ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై, తెలంగాణ ఆర్టిజన్లు, ఈనెల 22న, తమకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని. “చలో హైదరాబాదు” లోని, ఎస్పీ డీ సీ ఎల్, కార్యాలయం ముందు మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు, బీబీపేట్ లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇట్టి మహాధర్నాలను ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడు హాజరై, తమ హక్కుల సాధనకు పోరాడాలని, మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని, జిల్లా సీనియర్ ఆర్టిజన్ నాయకులు నాంపల్లి, కార్మికులకు పిలుపునిచ్చారు. ఇట్టి విలేకరుల సమావేశంలో. బి రాజేందర్, ఉప్పు స్వామి,సముద్రాల రాజు, కే. బాలేశం, లతోపాటు అధిక సంఖ్యలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper