ఫోటోషూట్ స్పాట్‌గా మారిన చలివాగు ప్రాజెక్ట్ బీజెపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ

August 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు రైతుల సాగునీటి అవసరాలు తీర్చాల్సిన ప్రాజెక్టుగా ఉండాల్సింది పోయి, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులకు ఫోటోషూట్ స్పాట్‌గా మారడం దురదృష్టకరమని బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ విమర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లడం, ఫొటోలు దిగడం, మీడియా ముందు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప రైతుల పొలాలకు సకాలంలో నీరు అందించేందుకు బీఆర్‌ఎస్ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.చలివాగు ప్రాజెక్టు ఫోటోషూట్ స్పాట్ కాదు.. వేలాది మంది రైతుల జీవనాధారం రైతుల పంటలు పండించేందుకు నిర్మించిన ప్రాజెక్టు వద్ద రాజకీయ ఫోటోలు దిగడం కాదు, రైతుల పొలాలకు నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.చలివాగు నీటి విషయంలో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఎవరి హయాంలో ఏం జరిగిందో చెప్పుకోవడం కంటే ప్రస్తుతం రైతులకు ఎంత నీరు అవసరం, ఎంత నీరు అందుబాటులో ఉంది, ఎప్పుడు విడుదల చేస్తారు అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.చలివాగు ప్రాజెక్టు కింద ఉన్న స్థానిక ఆయకట్టు రైతులకు ముందుగా అవసరమైన సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించేలా స్పష్టమైన విధానం ఉండాలని అన్నారు. రైతులు సాగు చేసుకున్న తర్వాత నీటి కోసం ఆందోళన చేసే పరిస్థితి రావడం పాలకుల వైఫల్యమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే చలివాగు ప్రాజెక్టు నీటి నిల్వలు, స్థానిక ఆయకట్టు అవసరాలు, ఇతర ప్రాంతాలకు తరలించే నీటి పరిమాణం, నీటి విడుదల షెడ్యూల్‌ను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా బీఆర్‌ఎస్ నాయకులు కూడా అధికారంలో ఉన్న సమయంలో చలివాగు నీటి విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించి, ఇప్పుడు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని అన్నారు.బీజేపీకి రాజకీయ ఫోటోలు, ప్రచార ఆర్భాటాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం. చలివాగు రైతుల పొలాలకు నీళ్లు వచ్చే వరకు రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నారు.చలివాగు ప్రాజెక్టు ఫోటోషూట్ కోసం కాదు రైతుల పంటల కోసం నాయకుల ప్రచారం కోసం కాదు రైతుల భవిష్యత్తు కోసం అని బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలియజేశారు….

🌐 Select Language:
📰 ePaper