బీజేపీ కోనసీమ జిల్లా పదాధికారుల సమావేశం – సంస్థాగత బలోపేతంపై చర్చ

July 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 25 (ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం అమలాపురంలోని సత్యనారాయణ విలాస్ హాల్‌లో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్‌చార్జ్‌లు, ఎస్.ఐ.ఆర్ కన్వీనర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘటన మంత్రి నూకల మధుకర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ కారంకిశ్రీనివాసరావు గుంటూరు జిల్లా ఇంచార్జ్ యాళ్ల దొరబాబు కర్రీ చిట్టిబాబు గని శెట్టి వెంకటేశ్వరరావు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకట రెడ్డి డైరెక్టర్ మట్ట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఎజెండా అంశాలు సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీల బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని నాయకులు సూచించారు.జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్ఠం చేయడానికి కార్యాచరణ రూపొందించారు. ప్రతి మండలంలోనూ పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలతో అనుసంధానం పెంచుకోవాలని నిర్ణయించారు.లక్ష్యం – కార్యకర్తల సమన్వయంఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే కోనసీమ జిల్లాలో బీజేపీని మరింత బలమైన శక్తిగా తీర్చిద్దవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.సమావేశం చివర్లో రాబోయే రాజకీయ, సంస్థాగత కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

🌐 Select Language:
📰 ePaper