
జనం న్యూస్ జూలై 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణనాడు వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగ పదవి లో స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి కళంకం తీసుకొచ్చి బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా కాగితాల్లో చంపేసి నాలుగు కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయానికే కళంకం తెచ్చారని ఈరోజు ఉదయం అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు తమ్మినేని సీతారాముని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేసిన కోడిల శివప్రసాద్ ను అన్యాయంగా లేనిపోని ఆరోపణలు చేసి మానసికంగా వేధించి శోభకు గురిచేసి తుదకు తన జీవితాన్నే నాశనం చేశారని నాగ జగదీష్ అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఫర్నిచర్ ను స్పీకర్ గా పదవి విరమణ తర్వాత ప్రభుత్వం కల్పించిన ఫర్నిచర్ ని అప్పగిస్తామని లేఖలు తెలియజేసినప్పటికీ స్వాధీనం చేసుకోకుండా దీని ఫర్నిచర్ విలువని ప్రభుత్వం చెబితే చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగిందని అయినప్పటికీ రాజకీయ కక్ష సాధింపులు చర్యలు పాల్పడ్డారని నాగ జగదీష్ మండిపడ్డారు. అటువంటిది తమ భూమిని తమ్మినేని సీతారాం కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ భూమి యజమాని విషయం పట్టించుకోలేదని, తుదకు అతను చనిపోయినట్లుగా చూపించి తమ్మినేని సీతారాం భూ కబ్జాకు పాల్పడ్డారని, వైసిపి పాలనలో అహంకారం, భూ దాహం ఏ స్థాయికి చేరిందో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం ప్రాంతంలో బయటపడుతున్న వైసిపి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని, బలహీనంగా ఉన్న వ్యక్తులు భూములను దృష్టి పెట్టి అధికారాన్ని ఉపయోగించి, తుదకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని భూ దందాలు చేసిన రాజ్యాంగం పదవిలో తమ్మినేని సీతారాం నాడు నీతి కబుర్లుచెప్పి నేడు అవినీతికి పాల్పడ్డాం నీతిమాలి చర్యని, తక్షణమే తమ్మినేని సీతారాo ను అరెస్టు చేసి రిమాండ్ కి పంపాలని నాగ జగదీష్ డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జా చేసిన భూమిని భూ యజమానికి అప్పగించి రికార్డులు సరిచేయాలని రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ కు నాగ జగదీష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ బోడి వెంకటరావు మల్ల శివన్నారాయణ మల్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.//