మంచనపల్లి లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం. డిప్యూటీ తహసీల్దార్ విరేశ్ బాబు
జనం న్యూస్ జులై 27, ( పరిగి నియోజకవర్గ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి)వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని మంచనపల్లి గ్రామములో ఆదివారం సైతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ కార్యక్రమంలో పాల్గొన్న పూడూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ విరేశం బాబు ,ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు,ఉద్యోగులు మరియు యూవజన సంఘం సభ్యులు పాల్గొని సర్ కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామామని,ఈ విధంగా పూడూర్ మండలంలోని ప్రతి గ్రామములో ముందుకు వచ్చి గడువులోగా పూర్తి చెయ్యాలని, బ్లాక్ లెవల్ ఆఫీసర్స్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని, ప్రతి గ్రామములో ఉన్న యూవజన సంఘ సభ్యులు (బి .ల్. ఓ) లకు సహకరించాలని,బి ల్ ఓ లు బ్లాక్ లేవల్ ఏజెంట్స్ తో (బి. ల్ .ఏ) లతో మరియు ఉద్యోగులతో యూవజన సంఘాల నాయకులతో , ప్రజా ప్రతినిధులతో, మాజీ ప్రజా ప్రతినిధులతో,అందరితో సమన్వయం చేస్తు గడువులోగా సర్ కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చెయ్యాలని, పూడూరు మండలం డిప్యూటీ తాసిల్దార్ వీరేష్ బాబు అన్నారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్, వై.శ్రీనివాస్,ఆర్ టి.సి ఉద్యోగులు రాములు,కానిస్టేబుల్ శివ,మంచనపల్లి బి ల్ ఓ.లు గోపాల్, శ్రీకాంత్ రెడ్డ్, శ్రీనివాస్ ,మరియు వివిధ పార్టీల నాయకులు,లకంసత్యనారాయణ ,వార్డ్ మెంబర్ బోడగాళ్ల నరేష్, రామాంజనేయులు, హరికృష్ణ, రాజు, శివకుమార్, అరుణ్, రాజశేఖర్, సందీప్, వెంకటేష్, గోపాల్, యాదగిరి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు*,