మంత్రి మల్లాడి కృష్ణారావును సన్మానించిన యానాం భాజపా నాయకులు

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 27 (ముమ్మిడివరం ప్రతినిధి )యానాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లాడి కృష్ణారావును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు స్వగృహంలో కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ యానాం ప్రజల సంక్షేమం, అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంత నిధులను సద్వినియోగం చేసి యానాంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి గనీసెట్టి అరవింద్ పాల్గొన్నారు.మంత్రి నాయకత్వంలో యానాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి మద్దతు తెలుపుతామని నాయకులు అన్నారు.

🌐 Select Language:
📰 ePaper