

జనం న్యూస్ జూలై 29 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సంస్థాగత సమావేశం ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ బూత్ స్థాయి మొదటి కన్వీనర్( బి ఎల్ ఏ 1) గొల్ల కోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహిపాల్ చెరువులోని వి కన్వర్షన్ హాల్ నందు జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా ఇంచార్జ్ కారంకి శ్రీనివాస్, కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, పి ఎం కిసాన్, పి ఎం ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నిజాలు తెలియజేయాలని కోరారు.ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యదర్శి రుద్రరాజు నరేంద్ర వర్మ, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, కొప్పనాతి దత్తాత్రేయ వర్మ, ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ మండలాధ్యక్షులు యనమండ్ర విజయ్ కుమార్, సఖి రెడ్డి శ్రీనివాస్, సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, చప్పిడి శ్రీ దుర్గా, కాట్రేనికోన మండల ప్రధాన కార్యదర్శి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు, రాయపు రెడ్డి, భైరవమూర్తి, ముమ్మిడివరం టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ, నియోజకవర్గ బూత్ స్థాయి రెండవ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.