మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యం – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

July 24, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ: రాష్ట్రoలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం భోజనం సమయం వరకు మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ (PTM) 4.0 అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం గవరపాలెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. చదువు, ప్రగతితో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుదలపై ఉపాధ్యాయులతో నేరుగా చర్చించేందుకు తల్లిదండ్రులందరూ భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశమని నాగ జగదీష్ అన్నారు. విద్యావ్యవస్థను ఉత్తమంగా తీర్చిదిద్దే ఈ కీలక కార్యక్రమంలో తల్లిదండ్రులoతా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇంటి వద్ద విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాలలో విద్యార్థుల పరీక్షలలో మంచి ఫలితాలు రుజువు చేస్తున్నాయని, అలాగే ఈ స్కూల్లో ఎన్సీసీ, ఉత్తమ ఉపాధ్యాయులు ఉండటం ఒక కారణమని నాగ జగదీష్ అన్నారు. ఇటీవల జరిగిన టెన్త్ క్లాస్ పరీక్షల్లో 580 పట్టణంలో ద్వితీయ స్థానం విద్యార్థుల తల్లిదండ్రులను నాగ జగదీష్ మల్ల సురేంద్ర పిలా లక్ష్మీ సౌజన్య కాండ్రేగుల సత్యనారాయణ అభినందించారు. సమావేశం అనంతరం ఉత్తమ ఫలితాలు పొందున విద్యార్థులకు విద్యార్థినిలకు డిక్షనరీ పుస్తకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మహాలక్ష్మి స్కూల్ కమిటీ చైర్మన్ కొణతాల పద్మావతి ఎన్సిసి ఆఫీసర్ కాండ్రేగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.//

🌐 Select Language:
📰 ePaper