మెట్‌పల్లిలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రాజగౌడ్

July 24, 2026 | వైరల్ వార్తలు

విద్యార్థినులకు అందుతున్న ఆహారం, వసతులపై ఆరా.. నాణ్యమైన విద్యతో ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచన

జనం న్యూస్, జులై 24, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: పట్టణంలోని అరపేటలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల హాస్టల్‌ను జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ కౌన్సిలర్లు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించిన రాజగౌడ్, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్‌లోని వసతి సౌకర్యాలు, విద్యాబోధన, విద్యార్థినులకు అందుతున్న ఇతర సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు.విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించిన వారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఓంకార్, మున్సిపల్ కౌన్సిలర్లు నూనుగొండ నరేష్ (10వ వార్డు), గుడికందుల అజయ్ (13వ వార్డు), అజీమ్ (21వ వార్డు), మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, నాయకుడు గజం రవి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper