మేడ్చల్–మల్కాజ్గిరి (అర్బన్) జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నూతన పదాధికారులకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఘన సన్మానం
జనం న్యూస్ జులై 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మేడ్చల్–మల్కాజ్గిరి (అర్బన్) జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పదాధికారులుగా నియమితులైన సందర్భంగా నూతన పదాధికారులు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు నూతనంగా జిల్లా ఓబీసీ మోర్చా కమిటీలో పదాధికారులుగా నియమితులైన అత్కరి మల్లేష్, సతీష్ గౌడ్,పండుగ రేణుక, తేజస్విని,శ్రవణ్ కుమార్ మరియు దిలీప్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను ఎల్లప్పుడూ గుర్తిస్తుందని, వారి అంకితభావం, సేవాభావంకు తగిన సమయంలో తగిన గుర్తింపు, బాధ్యతలు అందజేస్తుందని పేర్కొన్నారు.అదేవిధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఓబీసీల సంక్షేమం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వాటి ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ప్రయోజనం పొందేలా కృషి చేయాలని ఓబీసీ మోర్చా నూతన కమిటీ సభ్యులకు సూచించారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శేఖర్ యాదవ్ నాయకత్వంలో బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.