రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల బంద్‌ను విజయవంతం చేయడం జరిగింది ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్.

July 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 24 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలు నీట్ -2026 ప్రశ్నాపత్రం లీక్, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల బంద్‌కు వామ పక్ష విద్యార్థి నాయకులతో కలిసి బంద్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా తెలంగాణలోని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు మరియు ప్రజాస్వామ్యవాదులు ఈ బంద్‌కు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ప్రజాస్వామ్య నిరసనలకు లాఠీలు కాదు సంభాషణే సమాధానమని అన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన ప్రధాన డిమాండ్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి నీట్ -2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ)ను వెంటనే రద్దు చేసి పారదర్శక పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి విద్యార్థుల ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ హక్కులను మరియు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పరిరక్షించాలి ఆత్మహత్య కు పాల్పడి మరణించిన అభ్యర్థులకు నష్ట పరిహారం చెల్లించాలి పార్లమెంట్ లో నీట్ విద్యార్థుల సమస్య పై చర్చ జరపాలి విద్యార్థుల గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు కార్యకర్తలు ఇతర విద్యార్థి సంఘాలతో సమన్వయం చేసుకుని శాంతియుతంగా రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేశారు విద్యార్థుల హక్కుల కోసం విద్యను కాపాడేందుకు నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల బంద్‌ను విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పి డి యస్ యూ జిల్లా అధ్యక్షులు హాలీమ్ పాషా ఎ ఐ యస్ యాప్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యూ యస్ యాప్ ఐ రాష్ట్ర కార్యదర్శి రంగస్వామి పి డి యస్ యూ జిల్లా అధ్యక్షులు హరీష్ యన్ యస్ యూ ఐ జిల్లా నాయకులు ప్రకాష్ యోనా వీరేష్ నాని తదితరులు నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper