రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి

July 22, 2026 | వైరల్ వార్తలు

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్

జనం న్యూస్ జులై 22 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ ప్రధానమంత్రి నివాసం ఎదుట శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రా తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీ ఘటనలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.నెల రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలిచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ,ని అరెస్టు చేయడం ప్రశ్నించే గొంతులను అణచి వేయడమేనన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమగ్ర వివరణ ఇవ్వాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. దేశ యువత భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడు రాహుల్ గాంధీ, సారధ్యంలో అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper