రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పంటల సాగుపై రైతులకు అవగాహన

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జులై 28 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు పంటల సాగు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల నిర్వహణపై వ్యవసాయ అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వర్షాకాల పరిస్థితులకు అనుగుణంగా సజ్జ, కందులు తదితర చిరుధాన్య పంటలను సాగు చేయాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే విత్తన పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ చౌవత బాజ్ పాయ్ తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించి, రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందిస్తూ పంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ, జిల్లా కలెక్టర్ ఎల్కతుర్తి సర్పంచ్ ముణిగడప లావణ్య, ఏఎంసీ డైరెక్టర్లు పచ్చు బాపురావు, గొడిశాల రాజయ్య గౌడ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ బత్తిని రవింధర్ గౌడ్ వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper