వారాహి నవరాత్రుల్లో గీతార్చన పుస్తకాల పంపిణీ – హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వహిందూ పరిషత్ పిలుపు.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 22-07-2026 బుధవారం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు, భక్తులకు “లక్ష యువగళ గీతార్చన” పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు కుటుంబంలోని పెద్దల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు టెలివిజన్ సీరియళ్లకు దూరంగా ఉండి భగవద్గీతతో పాటు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లులే పిల్లలకు మంచి సంస్కారం, క్రమశిక్షణ, ధార్మిక విలువలను నేర్పించే ప్రధాన బాధ్యతను నిర్వర్తించాలని, “నేటి బాలలే రేపటి పౌరులు” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పంపిణీ చేసిన గీతార్చన పుస్తకాలను ప్రతిరోజూ చదివి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి బోయిల చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు బసాల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా సంస్కార శిక్షణ ప్రముఖ్ నాగిరెడ్డి, మండల ప్రఖండ అధ్యక్షులు అస్కని ఆనంద్, విశ్వహిందూ పరిషత్ జిల్లా, మండల కమిటీ సభ్యులు, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.