.విద్యార్థులు క్రమశిక్షణతో చదువు కొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి ఎమ్మెల్యే జీఎస్సార్..
జనం న్యూస్ ఆగస్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలోని లింగాల ఎంజేపీ పాఠశాలను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు.పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఆహార నాణ్యత,పరిశుభ్రత తదితర అంశాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అని అడిగి వివరాలు తెలుసుకున్నారు.తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్, రోజువారీ మెనూ గురించి అడిగి తెలుసుకుంటూ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,విద్యా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకుని,విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ,ఎంపీడీవో ఎమ్మార్వో పాఠశాల ఉపాధ్యాయులు, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య , పి.ఎ.సి.ఎస్ చైర్మన్ విజన్ రావు తదితరులు పాల్గొన్నారు….