విద్యార్థులు పట్టుదలతో ఉంటే ఏ ప్రభుత్వమైనా తలదించాలి
జనం న్యూస్ 26 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాట విజయమే తొలి నుంచి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉపాధ్యక్షులు పిజికె.గోవింద్ రాజ్, మాట్లాడుతూ.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పూర్తిగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థుల విజయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, అన్నారు. ఈ విజయానికి ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని, ఇది కేవలం విద్యార్థుల ఐక్యత, పట్టుదల, పోరాట స్ఫూర్తి సాధించిన విజయమని స్పష్టం చేశారు.జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్, మాట్లాడుతూ.విద్యార్థులు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని, ఎంతటి ప్రభుత్వాన్నైనా ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాల ద్వారా తల వంచేలా చేస్తుందని. ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందని అన్నారు. విద్యార్థి శక్తి ముందు అధికార పార్టీ అహంకారం నిలవలేదని పేర్కొన్నారు.ఈ ఉద్యమం ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలకు ఒక గట్టి హెచ్చరిక అని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడే ప్రభుత్వాలు ఇకపై ప్రజల ఉద్యమాలకు మరీ ముఖ్యంగా విద్యార్థుల ఉద్యమాలకు వ్యతిరేకంగా చేయటానికి గుండె దడ పుడుతుంది. అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా మీడియా ఇంచార్జ్ యు.రాముడు, అయిజ మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ, యు. ఆంజనేయులు, భాస్కర్, మహేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.