
జనం న్యూస్ జూలై 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని నలంద పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించు కుని సోమవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులు గోరింటాకు ఆకులను తీసుకువచ్చి సన్నగా దంచి, ఒకరికొకరు చేతులకు పెట్టుకుంటూ ఆషాడ మాస విశిష్టతను చాటిచెప్పారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. పాఠశాల ఆవరణ విద్యార్థుల కేరింతలు, గోరింటాకు సందడితో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంకట్ గౌడ్, ప్రిన్సిపాల్ గణేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు