సెల్ ఫోన్ పేలి విద్యార్థి మరణించాడు
జనం న్యూస్ ఆసిఫాబాద్ జిల్లా 24 -07-2026 తీవ్ర గాయాలైన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం..గూడెంకు చెందిన నికాడి లోకేశ్ ఇంట్లో సెల్ ఫోన్ చూస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది…ఈ ప్రమాదంలో విద్యార్థి మూతి భాగం తీవ్రంగా దెబ్బతింది.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు పేర్కొన్నారు….సెల్ ఫోన్ పేలిన ప్రమాదంలో 14 ఏళ్ల విద్యార్థి నికాడి లోకేష్ ముఖం మరియు దవడ భాగం తీవ్రంగా దెబ్బతిని మృతి చెందాడు.ప్రమాద వివరాలుకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.బాలుడు లోకేష్ ఇంట్లో ఫోన్ వాడుతుండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలింది.తీవ్ర గాయాలై బాలుడు అక్కడికక్కడే మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నిలిచింది.