సౌమ్యనాథుని సేవలో ఉచిత ఆటో సేవలను ప్రారంభించిన జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ.

July 29, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలంలో ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ వేద పండితులు అతికారి కృష్ణ కి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా ఆశీర్వచనాలు అందజేశారు.భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆటో సేవలు కల్యాణోత్స వానికి తరలివచ్చే భక్తులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఉచిత ఆటో సేవలను అతికారి కృష్ణ జెండా ఊపి వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా తమ పార్టీ అడుగులు వేస్తోందని, ఇటువంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో NDA నాయకుడు ఎద్దుల సుబ్బారాయుడు ,గీతాంజలి విద్యాసంస్థలు అధినేత SV రమణ, నరసింహ, ఒంటిమిట్ట సింగిల్ విండో చైర్మన్ జయ కృష్ణ , తుంగ రమణయ్య,నరసయ్య, కేదారనాథ్, కోరముట్ల హరి,కడప చిరంజీవి యువత నాయకులు రంజిత్, గురువిగారి వాసు, మల్లెం సుబ్బయ్య,ఒంటిమిట్ట నాయకులు మల్లేశ్వరరెడ్డి,గిరీష్ , మస్తాన్ ,అరుణ్,పాండే,ఓబులయ్య , పసుపులేటి మళ్ళీ ,సిద్ధవటం AMC డైరెక్టర్ బాబీ , గంగయ్య, విజయ్ , వాసు, మరియు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper