స్వీయ సంరక్షణ మానసిక శారీరక ఆరోగ్యానికి సంకేతం-బి సుధాకర్

July 23, 2026 | తెలంగాణ

108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహక అధికారి

జనం న్యూస్- జులై 23- నాగార్జునసాగర్ టౌన్-అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహక అధికారిబి సుధాకర్ మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ సొంత ఆరోగ్యాన్ని ప్రశాంతతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఉండాలని, స్వీయ సంరక్షణ అనేది స్వార్థం కాదు అది ఒక బాధ్యత మనసు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడే మన కుటుంబాన్ని చుట్టూ ఉన్న సమాజాన్ని సంతోషంగా ఉంచగలమని ఆయన తెలిపారు, అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జులై 24 వ తేదీన జరుపుకుంటామని, 2011లో యూకే ఆధారిత సంస్థ అయిన అంతర్జాతీయ స్వీయ సంరక్షణ ఫౌండేషన్ (ఐ ఎస్ ఎఫ్) జులై 24వ తేదీన స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ప్రారంభించిందని, స్వీయ సంరక్షణ అనేది రోజుకు 24 గంటలు వారానికి 7 రోజులు పాటించాల్సిన అలవాటు అని సూచించే విధంగా 7 వ నెల 24 వ తేదీని ఎంచుకున్నారని ఆయన తెలిపారు.108, ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారి తరఫున వైద్యులు మరియు ఆసుపత్రులపై ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడంలో స్వీయ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి 108 పైలెట్ శంకర్ ఈఎంటి రాకేష్ లు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper