జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 02-10-2026 శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,వనపర్తి జిల్లా నూతన కార్యవర్గాన్ని చైర్మెన్ అమరేందర్, వైస్ చైర్మన్ డాక్టర్.ప్రియాంక రాఘవేందర్ రెడ్డి గారిని,కోశాధికారి సి. జి.విష్ణువర్ధన్ గారిని సభ్యులు వేముల అమరేందర్,కృష్ణ గారిని గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తన స్వగృహంలో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల వరదాయినిగా పనిచేస్తుందని అనేక అత్యవసర సమయాలలో రెడ్ క్రాస్ సంస్థ చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. మానవ సేవయే మాధవ సేవా. రక్తదానం మహాదానం నినాదాలతో ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు.