ఆంధ్రప్రదేశ్

కాట్రేనికోనలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. 365 ప్రమిదలతో దీపోత్సవం

కాట్రేనికోనలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. 365 ప్రమిదలతో దీపోత్సవం

శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జనం న్యూస్ నవంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన: కాట్రేనికోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ది. 24-11-2026, మంగళవారం రోజున ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం 9 గంటలకు ఆలయ సన్నిధిలో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపబడును. కావున యావన్మంది భక్తులు పాల్గొని పూజలో కూర్చునే దంపతులు ముందుగా మీ పేర్లు నమోదు చేసుకోవలసినదిగా కోరుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద 365 ప్రమిదలతో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపబడును. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు ఆణె విఘ్న ఫణి కాంత్ శాస్త్రి, ఆలయ చైర్మన్ రంబాల మూలా స్వామి (చిట్టిబాబు), గ్రంధి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

ఇ-పేపర్