జర్నలిస్టుల హక్కులు మీడియా కమిషన్ ఏర్పాటు చెయ్యాలి నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్- అక్టోబర్ 2- నాగార్జునసాగర్ టౌన్- గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఐజేయు పిలుపు మేరకు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ మరియు సమస్యల పరిష్కారం కోరుతూ నందికొండలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే -ఐజేయు, ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసన కార్యక్రమం జర్నలిస్టులు చేపట్టారు, నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ బస్టాండ్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి టీయూడబ్ల్యూజే-ఐజేయు నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు వడ్లపల్లి వెంకటేశ్వర రెడ్డి, పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అక్కడ సమర్పించారు,అనంతరం నందికొండ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.అక్కడ మున్సిపల్ అధికారులకు జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారికంగా అందజేశారు, ఈ వినతిపత్రం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐజేయు పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కొరకు నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి పాత్రికేయుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు, మీడియా రంగంలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా వెంటనే నూతన మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలి, దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుల భద్రత,రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జాతీయ రక్షణ చట్టం తీసుకురావాలి, రద్దు చేయబడిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల క్రింద చట్టబద్ధమైన హక్కులను తిరిగి పునరుద్ధరించడంతో పాటు,నూతన వేతన మండలిని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు,ఇళ్ల స్థలాలు కేటాయించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరిగానే జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేసి, కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలి. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ పట్టణ టి యు డబ్ల్యూ (ఐజేయు) అధ్యక్షులు పాకాల నరసింహ, కార్యదర్శి టీకే ప్రకాష్, కోశాధికారి భూపతి రవీందర్, ఉపాధ్యక్షులు కోడా అప్పారావు, యాళ్ల విజయ్, సహాయ కార్యదర్శి యెబు రాజు, సుబ్బన్న శివరాం ప్రసాద్, గిరి, బద్రి, చారి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.