జనం న్యూస్ 2 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని శుక్రవారం రోజున సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తను అధికారం వచ్చినప్పటి నుండి మొదటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల మధ్య విపరీతమైన వైశాల్యాలను సృష్టించి అధికారం పదిలం చేసుకోవాలని ప్రయత్నం చేసిందని రెండో దఫా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వ్యతిరేకతలను పరిపాలనలో తమ వైఫల్యాలను ఆర్థిక దోపిడిని ప్రజలు గుర్తించడంతో ఎన్నికల సంఘాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకొని రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజలకు ఉన్న ఓటు హక్కును కాలరాసే విధంగా సిఇసి జ్ఞానేశ్ కుమార్ లాంటి తప్పుడు అధికారులను ఉపయోగించుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తుందని అన్నారు ముగ్గురు ప్రధాన ఎన్నికల అధికారులు ఉన్నప్పటికీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని మిగతా ఇద్దరు అధికారులు స్పష్టంగా గ్యానేశ్ కుమార్ పై తిరుగుబాటు చేయడంతో ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు అని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈసిఐ ని సంస్కరించాలని ఎన్నికల అధికారులను ఎన్నుకోవడంలో పారదర్శకత పాటించాలని ప్రధాని ఎన్నిక అధికారులను ఎన్నుకునే పద్ధతిలో మార్పులు చేయాలని ప్రతిపక్షాలకు రాజ్యాంగ సంస్థలకు విలువ ఇచ్చే విధంగా నిర్ణయాలు చేయాలని అన్నారు సెప్టెంబర్ 23న ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ప్రచురితమైన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్)కు సంబంధించిన సంచలనాత్మక వెల్లడింపులు, కేవలం ఆ ప్రక్రియపైనే కాకుండా, ముఖ్యంగా భారత ఎన్నికల సంఘం (ఈ సి ఐ) సమగ్రతపైనా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని దీనివల్ల భవిష్యత్తులో ప్రజలు ఓటు వేయాలంటేనే వెనుకడుగు వేసే పరిస్థితులు దాపరిచాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మొరిగాడి రమేష్ జూకంటి పౌలు వడ్డేమాన్ బాలరాజు ఘనగాని మల్లేశం మిట్ట శంకరయ్య మోరీగాడి అశోక్ ఎండి మతిన్ ఎండి ఖలీల్ డి వై ఎఫ్ ఐ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.