బిచ్కుంద అక్టోబర్ 2 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బిచ్కుందలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె.అశోక్ ఆదేశాల మేరకు అధ్యాపకులు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సత్యం, అహింస, శాంతి, సమానత్వం అనే గాంధీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించినారు . ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి . అశోక్ రావు, అధ్యాపకులు ఈ. బాలరాజ్, ఎండి గౌసుద్దీన్, రాథోడ్ రమేష్, బి రాజు, జి సంజు, వై. వెంకటేష్, ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు