ఆంధ్రప్రదేశ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు జనసేన సహాయ కార్యక్రమం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు జనసేన సహాయ కార్యక్రమం.

అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్జ నం న్యూస్, అక్టోబర్ 3 తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హత కలిగిన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించేందుకు జనసేన నాయకులు మోతీనగర్‌లో ఓటరు నమోదు సహాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుకు సంబంధించిన వివరాలు, అవసరమైన సమాచారం కోసం జనసేన నాయకులు, కార్యకర్తలను సంప్రదించవచ్చని తెలిపారు. మోతీనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని పట్టభద్రులు ఈ సహాయ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, బడే విశ్వేశ్వరరావు, ప్రభు చైతన్య అరేటి, మిరియాల చిట్టిబాబు, మత్తి శ్రీనివాసరావుతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

ఇ-పేపర్