(జనం న్యూస్): అక్టోబర్ 3 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ తరపున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు గుత్తుల సాయి,గంధం పల్లంరాజు దుశ్శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు,అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు,కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పి.గన్నవరం టిడిపి ఇంచార్జ్ మోకా ఆనందసాగర్,రాజోలు టిడిపి ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరామ్,రాష్ట్ర ఆక్వాబోర్డు డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మినారాయణ,రేవు శ్రీను, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పడాల సూపర్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు మద్దాల సుధీర్ రాజా తదితరులు పాల్గొన్నారు.