ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాను విజయవంతం చేయాలి ఎం ఎం పీ డీ ఓ ఫణి చంద్ర

జాబ్ మేళాను విజయవంతం చేయాలి ఎం ఎం పీ డీ ఓ ఫణి చంద్ర

జనం న్యూస్ అక్టోబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈనెల 9న భూపాలపల్లి పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జాబ్ మేళను విజయవంతం చేయాలని ఎంపీడీవో ఫణి చంద్ర తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వి వో ఏ లకు పంచాయతీ కార్యదర్శులకు జి పి ఈ ఓ లకు ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో పణిచంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులను జాబ్ మేళాకు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. వి వో ఏ లు పంచాయతీ కార్యదర్శులు జి పి ఓ లు తమ గ్రామాల్లోని నిరుద్యోగ యువతీ యువకులను చైతన్య పరిచి జాబ్ మేళాకు హాజరై విధంగా చూడాలని కోరారు ఈ జాబ్ మేళాను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎస్సై జక్కుల పరమేష్, ఏపిఎమ్ ఎర్రబెల్లి వేణుగోపాలరావు, ఎం పీ ఓ రంజిత్ కుమార్, ఏ పీ వో అనిత, ఏ వో ప్రియదర్శిని, ఐ కె పి సీ సీ లు విజయ్ కుమార్, శ్రీనివాసరావు, మంజుల, అనుష, వి వో ఏ లు పంచాయతీ కార్యదర్శులు జి పి ఓ లో అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్