తెలంగాణ

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించే పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి టి ఆర్ యస్ వి

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించే పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి టి ఆర్ యస్ వి

జనం న్యూస్ 05 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ మేము అనగా తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం [టి ఆర్ యస్ వి ] నుంచి తెలియజేయడమేమనగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు, ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సెలవు దినం రోజున మరియు ఆదివారం సెలవు దినం రోజున తరగతులు నిర్వహించిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా విద్యార్థులకు స్టడీ అవర్ పేరుతో రాత్రి అయిన కూడా వదలకుండా తీవ్ర ఇబ్బందుల కు గురిచేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆదివారం సెలవు దినం రోజున నిర్వహించిన పాఠశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తు మరల ఇలా పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేవా విద్యార్థి విభాగ కార్యకర్తలు వేణు గౌడ్ జస్వంత్ వినోద్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం (టి ఆర్ యస్ వి ) గద్వాల జిల్లా ఐజ మండలం

ఇ-పేపర్