జనం న్యూస్ అక్టోబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం 4 వ ఫేస్ కాలనీలోని ఎల్.ఐ.జి ఫ్లాట్స్ లో గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలు మరియు కలుషిత మంచినీటి సమస్యల పరిష్కారం నిమిత్తం, ఈరోజు వాటర్ బోర్డ్ డీజీఎం త్రినాథరావు కి బాధితుల తరఫున వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు కొల్లా శంకర్, ఆళ్ల నరేంద్ర అడ్వకేట్.వెంటనే త్రినాధ రావు స్పందించి వారి యొక్క సిబ్బందిని సమస్య ఉన్న ప్రాంతానికి పంపించి సమస్య పరిశీలించి,సమస్యలను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.మన కాలనీ అభివృద్ధికి మరియు సమస్యల పరిష్కారానికి అందరి సహకారం అవసరం అని జనసేన నాయకులు అన్నారు.