వైరల్ వార్తలు

ఓట్ల తొలగింపుపై ఏర్గట్లలో కాంగ్రెస్ భారీ ఆందోళన

ఓట్ల తొలగింపుపై ఏర్గట్లలో కాంగ్రెస్ భారీ ఆందోళన

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి– శివనోళ్ల శివకుమార్

జనం న్యూస్, అక్టోబర్ 05: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ) సర్వే పేరుతో అర్హులైన ఓటర్ల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.శివనోళ్ల శివకుమార్ మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడమేనని అన్నారు. ఓట్ల తొలగింపుకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వివిధ విభాగాల ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్