జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి. బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్ 5:. 10. 2026 జహీరాబాద్ పట్టణం అల్గోల్ రోడ్డులోని మంగళ గౌరీ సమేత శ్రీ సిద్దేశ్వరాలయంలో భాద్రపద మాసం పురస్కరించుకొని సోమవారం ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు.పట్టణానికి చెందిన చీలమామిడి విఠల్ కుటుంబ సభ్యుల చేత ఆలయ అర్చకులు సంగమేశ్వర స్వామి రుద్రాభిషేక క్రతువును జరిపించారు. ఆలయ EO శివరుద్రప్ప ఆదేశాలతో మహిళలచే కుంకుమార్చన, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామ పారాయణం చేయించారు.ప్రతి సోమవారం, అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, భక్తజన మండలి సభ్యులు పాల్గొన్నారు.