తెలంగాణ

పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలి

పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలి

జనం న్యూస్, అక్టోబర్ 05,అచ్యుతాపురం : అచ్యుతాపురం సెజ్ , ఫార్మా, ఇతర పరిశ్రమల యాజమాన్యాలు తక్షణమే ఈ నెల జీతాలతో కలిపి బోనస్ ఇవ్వాలని అచ్యుతాపురం జంక్షన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము,మండల కన్వీనర్ కె సోమునాయుడు మాట్లాడుతూ
బోనస్ చట్టం 1965 ప్రకారం లాభాల్లో ఉన్న ప్రతి పరిశ్రమ 8.33% నుండి 20% వరకు బోనస్ చెల్లించాలని,బోనస్ అనేది యాజమాన్యాల బిక్ష కాదు కార్మికుల హక్కు కార్మికులకు బకాయి పడ్డ వేతనం అని దీనిని అన్ని కేటగిరిలో పర్మినెంట్, కాంటాక్ట్, డైలీ వేస్,ఇతర అన్ని కేటగిరీల కార్మికులకు వర్తిస్తుందని, లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈనెల వేతనంతో పాటు అన్ని పరిశ్రమలు కార్మికులకు వెంటనే బోనస్ 20% చెల్లించాలని ,సెజ్ , ఫార్మా అన్ని పరిశ్రమ యాజమాన్యాలపై కార్మికులందరూ బోనస్ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సత్తిబాబు, బయ్యవరపు సన్యాసిరావు, రాము, అప్పన్న, బిస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్