జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం అక్టోబర్ 6. 10. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలోని మొదలైతాండ గ్రామంలో పవన్ రాథోడ్ జన్మదిన వేడుకలను అభిమానులు, స్నేహితులు, స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి పవన్ రాథోడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం, ముఖిమ్ హాజరై పవన్ రాథోడ్‌ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పవన్ రాథోడ్‌కు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలు లభించాలని, ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పవన్ రాథోడ్ జన్మదిన వేడుకలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, స్నేహితులు, గ్రామస్థులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం పలువురు నాయకులు, అభిమానులు పవన్ రాథోడ్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, అభిమానులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.