జనం న్యూస్ 07 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్అ క్టోబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద ఒక ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు 14-10-2026 సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టుకు 23 నుంచి 38 సంవత్సరాల వయస్సు కలిగి, ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని,డేటా విశ్లేషణ ప్రెజెంటేషన్, కంప్యూటర్ ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలని తెలిపారు.ఎంపికైన ఫెలోకు నెలకు రూ. 55,000 స్టైపెండ్‌తో పాటు నిబంధనల మేరకు నెలకు రూ. 5,000 వరకు ప్రయాణ భత్యం అందజేస్తారని తెలిపారు. ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు రైటింగ్ స్కిల్,పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, డేటా విశ్లేషణ,కంప్యూటర్/ఐటీ & పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ/వైవా వోస్ ద్వారా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్దేశిత దరఖాస్తును “ఆప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో అని పేర్కొన్న సీల్డ్ కవర్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని 14-10-2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, కుల,నివాస,అనుభవ ధ్రువపత్రాల స్వీయ ధృవీకరించిన ప్రతులతో పాటు రెండు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జత చేయాలని తెలిపారు. ఫెలోగా ఎంపికైన వారు గట్టు బ్లాక్‌లో అభివృద్ధి కార్యక్రమాల అమలులో బ్లాక్ అధికారులకు సహకరించడం, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడం,డేటా సేకరణ విశ్లేషణ,అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ఏబీపీ పోర్టల్ నిర్వహణ, నివేదికల తయారీ, ప్రజల భాగస్వామ్యం పెంపు వంటి కార్యక్రమాల్లో కీలకంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జారి చేయు వారు :-డిపిఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.