ఆంధ్రప్రదేశ్

ప్రియమైన దివ్యాంగ అభ్యర్థులకు హృదయపూర్వక సందేశం

ప్రియమైన దివ్యాంగ అభ్యర్థులకు హృదయపూర్వక సందేశం

జనం న్యూస్ 07 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్మ నకు ఉద్యోగం కావాలంటే ఒక్క నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూడకూడదు.అవకాశం ఎక్కడ కనిపిస్తే అక్కడ అర్హతను పరిశీలించి, దరఖాస్తు చేసి, సిద్ధతతో ముందుకు సాగాలి ప్రత్యేకంగా యస్ యస్ సి లో స్క్రైబ్‌ సౌకర్యం వర్తించే పరీక్షలు వచ్చినప్పుడు మనకు అర్హత ఉంటే వాటిని వదులుకోవద్దు. స్క్రైబ్‌కు వయస్సు, విద్యార్హత వంటి నిబంధనలు ఉన్నందున ప్రతి ఒక్కరికీ ఆ సౌకర్యం అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే మనకు లభించే అవకాశాన్ని ఆలస్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి.అయితే ఒక విషయం మరచిపోవద్దు యస్ యస్ సి కోసం చదివేది యస్ యస్ సి కే పరిమితం కాదు. మన చదువు మనతో పాటు ఇతర పరీక్షలకూ ప్రయాణిస్తుంది యస్ యస్ సి కోసం చదివిన గణితం బ్యాంకింగ్‌లో ఉపయోగపడుతుంది. రీజనింగ్‌ ఇన్సూరెన్స్‌లో ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్‌ అనేక పోటీ పరీక్షల్లో ఉపయోగపడుతుంది.
కరెంట్‌ అఫైర్స్‌ యస్ యస్ సి లోనూ బ్యాంకింగ్‌లోనూ రైల్వేలోనూ ఉపయోగపడుతుంది.అందుకే మన ఆలోచన ఇలా ఉండాలి.ఒక పరీక్ష కోసం చదవడం కాదు; ఒకే సిద్ధతతో అనేక పరీక్షలను ఎదుర్కోవాలి ఒక నోటిఫికేషన్ వస్తే దరఖాస్తు చేయాలి. మరో నోటిఫికేషన్ వస్తే కూడా దరఖాస్తు చేయాలి. అర్హత ఉన్న ప్రతి మంచి అవకాశాన్ని పరిశీలించాలి.
ఎందుకంటే మనకు ఏ పరీక్షలో విజయం ముందుగా వస్తుందో మనకు ముందే తెలియదు యస్ యస్ సి
లో వస్తే ఉద్యోగం. బ్యాంకింగ్‌లో వస్తే ఉద్యోగం. ఇన్సూరెన్స్‌లో వస్తే ఉద్యోగం. రైల్వేలో వస్తే ఉద్యోగం.పరీక్షలు వేరు కావచ్చు.
సిలబస్‌లో కొంత తేడా ఉండవచ్చు. కానీ మన లక్ష్యం మాత్రం ఒక్కటే స్వయం ఆధారిత జీవితం, గౌరవప్రదమైన ఉద్యోగం.కాబట్టి ఒక పరీక్షలో విఫలమైతే నా వల్ల కాదు అని అనుకోకండి. నా సిద్ధతలో ఏం లోపించింది?” అని ఆలోచించండి.ఒక అవకాశం చేజారితే నా అదృష్టం లేదు అని అనుకోకండి. తదుపరి అవకాశానికి ఇంకా బలంగా సిద్ధమవుదాం అని నిర్ణయించుకోండి. మనకు చూపు తక్కువగా ఉండవచ్చు. కానీ మన లక్ష్యం చిన్నదిగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు కొన్ని పరిమితులు ఉండవచ్చు. కానీ మన ప్రయత్నానికి పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దృష్టిలో లోపం ఉండొచ్చు దృక్పథంలో లోపం ఉండకూడదు. అవకాశాలు తక్కువగా ఉండొచ్చు ప్రయత్నాలు తక్కువగా ఉండకూడదు. ఒక మార్గం మూసుకుపోవచ్చు ప్రయాణం మాత్రం ఆగకూడదు. అందుకే నా సలహా ఒక్కటే:
అర్హత ఉన్న ప్రతి అవకాశాన్ని గుర్తించండి. సమయానికి దరఖాస్తు చేయండి. ఒకే ప్రణాళికతో అనేక పరీక్షలకు సిద్ధం అవ్వండి.ప్రతి పరీక్షను ఒక అవకాశంగా చూడండి. ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకోండి.ప్రతి రోజును మీ విజయానికి ఒక మెట్టుగా మార్చుకోండి.ఎందుకంటే ఉద్యోగం అదృష్టంతో మాత్రమే రాదు. అవకాశాన్ని గుర్తించే తెలివి అవకాశాన్ని ఉపయోగించే సిద్ధత విజయం వచ్చే వరకు కొనసాగించే పట్టుదల ఈ మూడు కలిసినప్పుడే విజయం మన సొంతమవుతుంది. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకు సిద్ధతతో ముందే నిలబడు. ఒక్క పరీక్షను నమ్మకు అనేక అవకాశాలను అందిపుచ్చుకో ఒక్కసారి ఓడిపోకు ఓటమి నుంచి నేర్చుకో లక్ష్యం చేరేవరకు ఆగకు విజయం నీ అడుగుల వెంట నడిచే వరకు సాగు.

ఇ-పేపర్