తెలంగాణ

నేటి నుండి శ్రీ రాజరాజేశ్వరి మాత నవరాత్రి ఉత్సవాలు

నేటి నుండి శ్రీ రాజరాజేశ్వరి మాత నవరాత్రి ఉత్సవాలు

జనం న్యూస్ అక్టోబర్ 11 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఈరోజు నుండి శ్రీ రాజరాజేశ్వరి మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి మాత అవతారంలో భక్తులకు కనువిందు చేస్తుంది శ్రీ రాజరాజేశ్వరి మాత ఉపాసకులు విటాల మురళీధర్ శర్మ ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది 9 రోజులు ఎంతో నియమనిష్ఠలతో అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహిస్తారు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది అందుకని శ్రీ రాజరాజేశ్వరి మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీ రాజరాజేశ్వరి మాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని చండూర్ మురళీధర్ శర్మ తెలియజేశారు ఓం శ్రీమాత్రే నమః సర్వేజనా సుఖినోభవంతు

ఇ-పేపర్