జనం న్యూస్ అక్టోబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం మొదలైన ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చుకుని వచ్చి దేవాలయంలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఆటపాటలతో జరుపుకున్నారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఏర్పాట్లు చేసినారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ఆయన మాట్లాడుతూ అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వందల సంవత్సరాల నుండి మహిళలు బతుకమ్మ ఉత్సవాలను ఎనిమిది రోజులపాటు జరుపుకుంటారని 9వ రోజు సద్దుల బతుకమ్మను తాళ్లకుంట చెరువు వద్ద జరుపుకుంటారని అన్నారు. అనంతరం దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్ గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సేన రెడ్డి రాజారాం రెడ్డి వార్డు సభ్యులు కొత్తపెళ్లి రవీందర్ పరిమళ నోములేశ్వర్ రాయరాకుల సుమన్ ఉప్పు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….