తెలంగాణ

కాన్షీరాం ఆశయాలను సాధించాలి క్రాంతి కుమార్*

కాన్షీరాం ఆశయాలను సాధించాలి క్రాంతి కుమార్*

జనం న్యూస్ అక్టోబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో. మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంత్ కుమార్ మాట్లాడుతూ కాన్షిరాం ఆలోచన విధానాన్ని మనమందరం పాటించాలని తన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని అన్నారు. కాన్షిరాం బహుజన రాజ్యాధికారం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని బహుజనుల ఆత్మ ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ఒక దళిత బిడ్డ అయినటువంటి బెహన్ జి మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశాడని తెలిపారు. ఈ సమాజంలో అగ్రవర్ణ జాతుల అహంకార రాజకీయ పొకడలతో కింది జాతులను అణచివేస్తున్న క్రమంలో దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించాడాని అన్నారు. మెజార్టీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కూడా మాన్యవర్ కాన్సిరాం అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్,హన్మకొండ జిల్లా కార్యదర్శి మారపల్లి విజయ్ కుమార్, శాయంపేట మండల అధ్యక్షులు మారెపల్లి సుధాకర్, రాజేష్, నాలికె రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు……

ఇ-పేపర్