
జనం న్యూస్ అక్టోబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఐ.పోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం రూ.10.27 కోట్లతో చేపట్టిన రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి పనులను ప్రారంభించారు. ఇందులో సీసీ, బీటీ, డబ్ల్యూబీఎం రోడ్లు, డ్రైనేజీలకు రూ.718.85 లక్షలు, పంచాయతీరాజ్ ప్రాజెక్టులకు రూ.150 లక్షలు, జల్ జీవన్ మిషన్ వాటర్ ట్యాంకులకు రూ.98.50 లక్షలు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.60 లక్షలు కేటాయించారు. టీ.కొత్తపల్లి-జి.మూలపాలెం మధ్య 3.40 కి.మీ రోడ్డుకు రూ.1.48 కోట్లు, జి.మూలపాలెంలో రూ.94 లక్షలు, జి.వేమవరంలో రూ.1.86 కోట్లు, గుత్తినదీవిలో రూ.58 లక్షలతో పనులు చేపట్టారు. మురమళ్ల-ఐ.పోలవరం, బాణాపురం, దుర్గమ్మ సెంటర్-కేసనకుర్రు, టీ.కొత్తపల్లి పరిధిలో దుప్పిలంక, బండిరేవుల, చింతలమెరక, అలవల పొంత, గంజావారి మెరక, రెడ్డివారితోట, గుత్తినదీవిలో ధ్వజస్తంభం, దుర్గగుడి, రాఘవేంద్రపురం, జి.వేమవరం, జి.మూలపాలెం పరిధిలో పలు సీసీ, డబ్ల్యూబీఎం, గ్రావెల్ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తోందని, జల్ జీవన్ మిషన్ను 2028 వరకు కొనసాగించి ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందిస్తామని తెలిపారు. బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మండల టీడీపీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు, దాట్ల పృథ్వీరాజ్, దాట్ల పవన్, జనసేన మండల అధ్యక్షుడు పురుషోత్తం, స్థానిక ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.