జనం న్యూస్ అక్టోబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి తన మిత్రుడు, స్నేహితుడు జి. ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి స్వీట్లు తినిపిస్తూ జన్మదిన వేడుకలను సంతోషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ. జి. ప్రసాద్ తన జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తూ విజయపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగి, కుటుంబ సభ్యులతో పాటు సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ, ప్రతి సంవత్సరం మరింత ఆనందంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్నేహబంధానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుక ఆత్మీయత, ఆనందాల మధ్య కొనసాగింది.
ఈ కార్యక్రమంలో వి. తాండవ కృష్ణ, జి. నర్సింగరావు, సూర్యనారాయణ, శ్రీధర్, గణేష్, సాంబశివరావు, అఖిల్, మురళి తదితరులు పాల్గొని జి. ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.