జనం న్యూస్ అక్టోబర్ 13: వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ 11వ వార్డు శ్రీ భవాని సేన ఆధ్వర్యంలో చిన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న సందర్భంగా హోమం మరియు పూజా కార్యక్రమంలో డాక్టర్ తులసి సహదేవుడు దంపతులము పాల్గొనడం జరిగింది అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.