జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని 5 వ వార్డ్ లో శాయంపేట ఎస్ పి టి యూత్ సభ్యుల దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గా దేవి ప్రతిష్టాపించారు మూడువ రోజు అన్నపూర్ణాదేవి సందర్భంగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి జన్మదిన సందర్భంగా మహా అన్నదానం కార్యక్రమాన్ని 10 వ వార్డ్ మెంబర్ మారపెల్లి ప్రియాంకా సుమన్ ప్రారంభించారు అధిక సంఖ్యలోభక్తులు వచ్చి మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఎస్ పి టి యూత్ సభ్యులు బీ ఆర్ ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి గణేష్ మండల మాజీ అధ్యక్షులు గుర్రం రవీందర్ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.