ఆంధ్రప్రదేశ్

దోమ మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన – బడంపల్లి నరేష్

దోమ మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన – బడంపల్లి నరేష్

జనం న్యూస్ అక్టోబర్ 18, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లోని,దోమ మండలం, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని. బడంపల్లి నరేష్ మండల ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో గౌరమ్మను పూజించిన ఆడబిడ్డల జీవితాల్లో సద్దుల బతుకమ్మ పండుగ సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ వేళ, మండలంలోని ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.మండల ప్రజలందరూ ఈ పండుగలను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, మరియు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని బడంపల్లి నరేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇ-పేపర్