బిచ్కుంద అక్టోబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలోని జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ మలికార్జునప్ప షెట్కర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ చైర్ పర్సన్ సీమ షెట్కర్ కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెట్కర్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఆయన సేవలు, ఆశయాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్ , మున్సిపల్ చైర్మన్ సిమ్మ శెట్టార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, యువ నాయకులు సాహిల్ సేట్, రాజు సేట్, సతీష్ సెట్ మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కౌన్సిలర్ నౌషా నాయక్ జుక్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, కొండ గంగాధర్ ఉత్తమ్ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.